I wrote a poem, during Telugu new year, in Telugu. Today, I tried to make an English poem out of it. It subtly glorifies many gods/goddesses in our scriptures. I tired to bracket the “may be unknown” terms. I hope you will enjoy the poem and the devotion hidden behind the lines of glamour!
దేవ దేవుని పాదరేణువు /
కాదా మన ప్రాణ వేణువు //
Isn’t the music of our soul /
A spec of dust on HIS Sole //
నట రాజుని నటన విలాసము /
అవ్వదా మన నయనమునకు వికాసము //
Is not the dance of Nataraja – The cosmic dance/
An evolutionary spark to our inner eyes//
ఉరుక్రముని త్రివిక్రత్వము /
నేర్పె జీవకోటికి భ్రాతృత్వము //
The globular nature of the Cosmos/
Taught the brethren, a lesson of Oneness//
పద్మనాభుని భుజగశయ్య /
మోసె భక్తుల భవ భారమయ్యా //
The thousand hooded serpent bed (of Vishnu)/
Weighs the weights of those devoted //
అర్ధనారీశ్వరుని ఒక అర్థభాగంబు /
తీర్చె తన బిడ్డల అత్రంబు, మరియొక అర్థభాగంబు /
చూపె ఆ బిడ్డలకు జీవన విధానంబు //
One half of the lord hermaphrodite (Arthanarishwar)/
Satiated the worry of sons, while the other half/
Showed those sons the path Bright!
కారడవుల జటాజూటము /
కాలయమునకు విశ్రాంతి కూటము//
The dark impregnable hair (of Shiva)/
Is a refugee place for the Death’s Heir (Yama)//
నీలి దేహపు నీలలోహితుడు /
నీళ్లు నీళ్లుగ జేసె భూతల నిలయము //
The bodily blue hues of the SKY lord (Rudra)/
Made our planet, a Blue Lord (Blue planet)//
ఘోర రావపు రుద్ర నాదము /
చెవునకింపుగ రాగములనమర్చె //
Lord Rudra had a huge CRY/
Which arranged the musical tones, for us to TRY//
విశేషంబగు రామ బాణము /
గ్రుచ్చి చీల్చె మన విరామ కోణము //
The special arrow of lord Rama /
Pierced through the angles of Lazy Karma//
పాఞ్చజన్యపు శంఖారావము /
పంచ ప్రకృతులకు నిత్యారామము //
Rumbling of the Krishna’s conch/
From it the FIVE natures ever launch//
గిరినందిని అడుగుల సవ్వడి /
విని పులకించె భూ-మయూర యుగళి //
The melodies of Parvati’s foot steps/
Thrilled the universal couplets (Jivatman and Paramatman)//
నెలరాజుని క్షయ రోగము /
తీర్చు భవరోగము, తెచ్చు మనోభోగము //
The periodical moon phases/
Bring aesthetic joys and mental poise//
గరళ కంఠుని కాల సర్పము /
చిమ్మె మరుగు పడని కాలరాత్రము //
The swirly snake on Shiva’s neck/
Spit unfathomable darkness on to the Cosmos’s Back//
నరసింహుని ఉగ్రనేత్రములు /
పూసె సాయం సంధ్యా అరుణ వర్ణములు //
The red color in the eyes of Narasimha/
Smeared itself to the twilight’ hue//
వినతా తనయుడు గరుత్మంతుడు /
పక్షి కోటికిచ్చె విహంగామృతములు //
Son of Vinata (Garuda), the matchless Might/
Gave the bird kingdom, their eternal Flight//
అదితీ కొమరుండు ఆదిత్యుడు /
జీవకోటికిచ్చె జన్మ జన్మల అమరత్వము //
The Solar god, son of undifferentiated dark glow (Aditi)/
Gave the many lives, a ceaseless flow (many janmas/lives)//
విధి రచయిత విధాతా !!
విచిత్ర నడవడి నీ చేతి రాత!!!!
Oh the creator and master of fate (Brahma)!
Your wit and write is an amusing state!!
— © Tejaswi